గిరిజనుల సమస్యల పరిష్కారంలో కూటమి విఫలం: గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్
గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్ ఆరోపించారు. సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో డీఆర్వో మురళి, ఆర్డీవో మధులతలకు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. నాదెండ్ల మండలం కనపర్రులో గిరిజనులకు ఆధార్, రేషన్ కార్డులు లేవని, బొల్లాపల్లి నుంచి వెల్దుర్తి వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.