మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నల్లమాడ మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లోని నల్లమాడ మండలంలోని పెమ్మనకుంట పల్లి తండాలో కోటి సంతకాల సేకరణ, రచ్చ బండ కార్యక్రమం వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేస్తోందని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పేద విద్యార్థులకు ఎంతో అండగా నిలిచారని తెలిపారు