నంద్యాల అర్బన్: నేరస్తులకు శిక్షపడేలా కేసులో దర్యాప్తు చేపట్టాలి :నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు
Nandyal Urban, Nandyal | May 22, 2026
నేరస్థులకు శిక్ష పడేలా కేసుల దర్యాప్తు చేపట్టాలని నంద్యాల ఏఎస్పీ ఎన్.యుగంధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు మానిటరింగ్ సెల్, సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరగాలన్నా, సమాజంలో నేరాల శాతం తగ్గాలన్నా కోర్టులలో కేసుల నిరూపణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ జావలి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు