సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ
చీమకుర్తి పట్టణంలో వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులు భారీ జాతీయ జెండాతో శుక్రవారం ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. చీమకుర్తి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు చేపట్టారు. వందేమాతరం గీతం యొక్క గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విద్యార్థులతో చేపట్టినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.