ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంవద్దటిడిపిశ్రేణులు వినూత్నంగా,ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను సోమవారం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు వినూత్నంగా నిర్వహించారు, ముచ్చుమర్రి టిడిపి నాయకులు ప్రజలు పాదయాత్రగా ఎత్తిపోతల పథకం సమీపంలోని కాలువ వద్దకు చేరుకొని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు, ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అంటూ కొనియాడుతూ, రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు పాత్ర మరువలేనిది కొనియాడారు