ఒంగోలు అర్బన్: నీట్ పేపర్ లీక్ అవడంపై ఒంగోలులో ఏపీ విద్యార్థి యువజన రాష్ట్ర అధ్యక్షుడు వాయపాటి జగదీష్ ఆగ్రహం
Ongole Urban, Prakasam | May 15, 2026
దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది వైద్య విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఒంగోలులో ధ్వజమెత్తారు. జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.