గంపలగూడెం లో తెలుగుదేశం నేత విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు: వివరాలను వెల్లడించిన సీఐ గిరిబాబు
Tiruvuru, NTR | Sep 16, 2025 తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం లో తెలుగుదేశం నేత విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తిరువూరు సిఐ గిరిబాబు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గంపలగూడెంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. విగ్రహం ధ్వంసం విషయంపై ఈ నెల 15న ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి విచారించి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.