ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్ లో లేకుండా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడంతో పాటు ఇంటి పట్టాల రీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, తహసిల్దార్ల ను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్ధర్లతో సమావేశమై హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేసి ఇళ్ల స్థలాల మంజూరు చేయాలన్నారు