బొమ్మలరామారం: ఉన్నవాడు తినే సన్నబియ్యాన్ని పేదవాడు సైతం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది: బీర్ల ఐలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యాన్ని ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఉన్నవాడు తినే సన్నబియ్యాన్ని పేదవాడు సైతం తినాలని ఉద్దేశంతో ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.