చిన్నమండ్యం–రాయచోటి మార్గం పసుపుమయం!
చిన్నమండ్యం మండలంలోని దేవగుడిపల్లెలో గృహప్రవేశ కార్యక్రమానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా రాయచోటి నుంచి చిన్నమండ్యం వరకు రహదారి అంతా స్వాగత బ్యానర్లు, ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో కళకళలాడుతోంది. హైవే మొత్తం పసుపు రంగుతో నిండిపోవడంతో ప్రాంతం పసుపుమయంగా మారింది.ముఖ్యమంత్రి పర్యటనకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగత ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సీఎం రాకను ఉత్సవంలా మార్చేందుకు సన్నాహాలు చేశారు.