కార్వేటినగరంలో బంగారమ్మ జాతర అంగరంగా వైభవంగా జరుగుతోంది. బుధవారం అమ్మవారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు బలిదానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డ్రమ్స్, వివిధ నాటక కళాకారులు ఆకట్టుకుంటున్నాయి. యువకులు డాన్సులతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.