వరంగల్: వరంగల్ భద్రకాళి ఆలయంలో నేడు సామ్రాజ్య పట్టాభిషేకం మరియు కల్యాణ మహోత్సవం
వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సామ్రాజ్య పట్టాభిషేకం, సాయంత్రం భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.