నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని అప్పన పల్లి లో నివాసముంటున్న పల్లె శివలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జయప్ప తెలిపారు, ఆమె వయసు 30 ఏళ్లు ఉంటుందన్నారు, భర్త రాధాకృష్ణ తాగుడుకు బానిసై సంసారాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడని ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు