ఆత్మకూరు ఎస్: భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు: ఆత్మకూరు ఎస్ లో కలెక్టర్ తేజస్
భూసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని కలెక్టర్ తేజస్ అన్నారు. ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో గ్రామ రైతువేదికలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించారు. సదస్సులో రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. భూసమస్యల పరిష్కారం కోసం సిబ్బంది కృషి చేయాలని సూచించారు.