ఉండి: అజ్జమూరు పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులుగా విద్యార్థులే పాఠాలు చెబితే ఎలా ఉంటుందో ఆకివీడు మండలం అజ్జమూరు పాఠశాల నిరూపిస్తోంది. ప్రధానోపాధ్యాయులు ఆర్వీఎస్ నారాయణ ప్రోత్సాహంతో నాల్గవ తరగతి విద్యార్థులు స్వయంగా ఇంగ్లీష్ సబ్జెక్టులోని 'ట్రిప్ ఆఫ్ మెమరీస్' అనే పాఠాన్ని బోధించారు. విద్యార్థులకు ఇలా శిక్షణ ఇవ్వడంపై మంగళవారం మధ్యాహ్నం 3:30 కు హెచ్ఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆయన
అన్నారు.