ఒంగోలు అర్బన్: నీట్ పరీక్ష కేంద్రాలను, పేపర్లు భద్రపరిచే లాకర్లను ఎస్పీతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 20, 2026
21వ తేదీన జరిగే నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. పరీక్షలు జరిగే ఒంగోలు నగరంలోని 6 సెంటర్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఒంగోలులోని నవోదయ, కేంద్రీయ విద్యాలయం, దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డి.ఆర్.ఆర్.ఎం. పాఠశాల, పివిఆర్ బాలుర పాఠశాలలను ఈ పరీక్షకు ఎంపిక చేశారు. వీటితోపాటు ప్రశ్న పత్రాలను భద్రపరిచే కర్నూలు రోడ్డులోని భారతీయ స్టేట్ బ్యాంకు లోని లాకర్ సదుపాయాన్ని కూడా వీరు పరిశీలించారు.