బనగానపల్లె: బనగానపల్లెలో ఆంజనేయస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లెలో ఎస్ఐసీ కార్యాలయం సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే పాత ఎంఆర్జే (ప్రస్తుత ఆర్డీఓ) కార్యాలయ పునరుద్ధరణ పనులను తనిఖీ చేసి, పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు