వెంకటాపురం: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ ధర్నా
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్స్ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా నేడు సోమవారం రోజున ములుగు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి అదనపు కలెక్టర్ సంపత్ రావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భగా సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, జీతాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే కలెక్టర్ సర్కులర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.