పేకాట రాయులకు ఏడు రోజుల జైలు శిక్ష. 300 రూపాయల జరిమానా.తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి
పేకాట రాయులకు ఏడు రోజుల జైలు శిక్ష. 300 రూపాయల జరిమానా. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో 2023వ సంవత్సరంలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ 11 మందిని తంబళ్లపల్లె జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి గురువారం 7 రోజులు జైలు శిక్ష 300 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారిని తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్ గురువారం తెలిపారు. 300 రూపాయలు జరిమానా చెల్లించలేని పక్షంలో మరో 30 రోజులు సాధారణ జైలు శిక్ష అమలు చేయాలని జడ్జి తీర్పు వెలువరించారని తెలిపారు.