డోన్: బేతంచెర్ల మద్దిలేటి స్వామి ఆలయంలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
Dhone, Nandyal | Jun 25, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను కొలువుంచి సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ ప్రాకారంలో వైభవంగా ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Saved successfully