దుగ్గొండి: మందపల్లిలో పోలీస్ జాగృతి కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలు
దుగ్గొండి పరిధిలో పోలీస్ జాగృతి కళాబృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరిగింది పోలీస్ కమిషనరేట్ జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో స్థానికులకు మత్తు పదార్థాలతో పాటు సైబర్ క్రైమ్ బాల్య వివాహాలు మూఢనమ్మకాలు షీ టీం పై అవగాహన కల్పించారు కళాజాత బృందం ఈ కార్యక్రమానికి దుగ్గండి ఎస్సై వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఎస్ఐ తెలిపారు.