కొండేపిలో మంగళవారం నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విత్ లీడర్స్ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మంచి ప్రతిభ కనబరిచిన కార్యకర్తలకు ఉత్తమ కార్యకర్త అవార్డులను ఉగ్ర నరసింహారెడ్డి పంపిణీ చేశారు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.