ఒంగోలు అర్బన్: బాల బాలికల సమగ్ర అభివృద్ధి మరియు సాధికారతను లక్ష్యంగా “కిషోర్ వికాసం” : జాయింట్ కలెక్టర్
Ongole Urban, Prakasam | May 2, 2026
ప్రకాశం జిల్లాలో బాల బాలికల సమగ్ర అభివృద్ధి మరియు సాధికారతను లక్ష్యంగా చేసుకుని నిర్వహించబడుతున్న “కిషోర్ వికాసం” వేసవి కార్యక్రమం PGRS హాల్ లో జిల్లా లెవెల్ లో మండల్ శిక్షణ కార్యక్రమం జరిగినది.శనివారం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, యుక్తవయస్కులైన బాల బాలికలకు సరైన మార్గదర్శకత్వం, అవగాహన మరియు రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల శారీరక, మానసిక, సామాజిక మరియు విద్యా అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.