రాప్తాడు: ఇటుకలపల్లి గ్రామంలో SSBN, NSS యూనిట్ వన్ ఆధ్వర్యంలో నో సే డ్రగ్స్ గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ ఇటికలపల్లి గ్రామంలో ఆదివారం ఐదు గంటల పది నిమిషాల సమయంలో అనంతపురం ఎస్ ఎస్ బి ఎన్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో నో సే డ్రగ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆఫీసర్ మహబూబ్ బాషా వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఎస్ ఎస్ బి ఎన్ ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో దత్త గ్రామమైన ఇటికలపల్లిలో యువత డ్రగ్స్ వాడటం వల్ల జరిగే అనర్ధాలు గురించి ప్రజలకు విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగిందని సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఎస్ ఎస్ బి ఎన్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బాబా ఫక్రుద్దీన్ , వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు.