బాల్కొండ: తిమ్మాపూర్ లో 108 లో ప్రసవించిన గర్భిణి
మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మంజులకు ఇంటి వద్ద పురిటినొప్పులు ఎక్కువ కావడంతో 108కు ఫోన్ చేశారు. భీంగల్ 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో చేరుకుని, మార్గమధ్యంలోనే ప్రథమ చికిత్స అందిస్తూ కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. EMT త్రిషల, పైలట్ రాజయ్యల కృషితో మగ బిడ్డ జన్మించింది. అనంతరం తల్లి, శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు, వైద్యులు అభినందించారు.