ఒంగోలు అర్బన్: మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం మెగా స్కాం చేసింది : మాజీ మంత్రి మెరుగు నాగర్జున
Ongole Urban, Prakasam | May 25, 2026
రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు మెగా స్కామ్ చేసిందని మాజీ మంత్రి మెరుగు నాగర్జున విమర్శించారు సోమవారం ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ పేపర్ లీకేజీ లో భారీగా డబ్బులు చేతులు మారాయని ప్రభుత్వం దీనిపై సిబిఐ ఎంక్వయిరీ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలని ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన నిలదీశారు డిఎస్సి పేపర్ తయారీలో కాంట్రాక్టు ఉద్యోగులను పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు కాంట్రాక్టు ఉద్యోగిగా ఉన్న వ్యక్తి పేపర్ తయారీలో ఉన్న వ్యక్తి డీఎస్సీ ఎగ్జామ్ రాసి మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడని ఇది సరైనది కాదన్నారు