టీడీపీ కొండపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం సోమవారం శ్రీ సాయి సీతారామ కళ్యాణ మండపంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ సత్య హాజరుకానున్నారు. సమావేశాన్ని జయప్రదం చేయాలని పొన్నలూరు మండల టీడీపీ అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు ఆదివారం కోరారు. మండలంలోని నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.