నంద్యాల అర్బన్: వివోఏ లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 21, 2026
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.మంగళవారం పలువురు వీవోఏలకు అత్యాధునిక 5Gసదుపాయం కలిగిన స్మార్ట్ ఫోన్లను ఆమె అందించారు. జిల్లాలో మొత్తం 1,086 మంది VOAలకు నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని వెల్లడించారు.