కావలి: కావలిలో భారీ ఇస్తిమా.. హాజరైన ముస్లిం సోదరులు
కావలిలోని జామియా మసీదులో మంగళవారం భారీ ఇస్తిమా జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రవక్త మహ్మద్ జీవన విధానం,ఆయన బోధనలు వివరించారు. సమాజంలో ఐక్యత, సేవా భావం అవసరాన్ని నొక్కి చెప్పారు. ముస్లింలు ఆత్మీయ వాతావరణంలో మునిగిపోయారు. రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఉన్నారు. ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.