రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ లో మహిళా మృతదేహం కలకలం
రాజేంద్రనగర్ కిస్మత్పూర్ గిరిధర్ కన్స్ట్రక్షన్ వద్ద మహిళ(35) మృత దేహం కలకలం రేపింది. పోలీసుల వివరాలిలా.. మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు డెడ్బడీ వద్ద వివరాలు సేవరిస్తున్నారు. దుండగులు మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా? మరేదైనా కారణంగా హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.