దుబ్బార్లపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్బదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం దుబ్బార్లపల్లి గ్రామంలో బుధవారం పదిన్నర గంటల సమయంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా 4000 రూపాయల పింఛన్లను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ పింఛన్ లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.