డోన్: ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి :ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
Dhone, Nandyal | Apr 16, 2026 డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్లబ్ హౌస్‌లో గురువారం మెప్మా ఆర్‌పీలు మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాల జిల్లా పీడీ వెంకట దాస్ మరియు డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రగతి నివేదికలు, అలాగే ఎదురవుతున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పథకం లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు కావాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు చేరేలా కృష