నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
Nandyal Urban, Nandyal | Apr 28, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా కురిసిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన జనం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. భానుడి సెగ నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. వేడి గాలుల స్థానంలో చల్లని గాలులు వీయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.