రాజేంద్రనగర్: హుస్సేన్ సాగర్ లో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం
హుస్సేన్సాగర్లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్ బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.