నాగులుప్పలపాడు: సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిరాలపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన విజయ్ కుమార్
సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో పలు అభివృద్ధి పనులకు సంత నూతలపాడు ఎమ్మెల్యే బియన్ విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా బి ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారిగా మద్దిరాలపాడు గ్రామానికి రావడం మన అందరి అదృష్టమని 100 రోజుల్లోనే మన గ్రామ సమస్యలను పట్టించుకోని ఎస్సీ కాలనీలో శంకుస్థాపన చేశామని ఇది మన అదృష్టమని అన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచి గ్రామ నాయకులు ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు