సంగారెడ్డి: పెండింగ్ వేతనాలు చెల్లించాలని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల నిరసన
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ మూడు నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.