జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ నిర్వహించారు.ప్రజల ఫిర్యాదులను స్వయంగా విని, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు వంటి అంశాలపై విచారణ జరిపారు.నడవలేని స్థితిలో వచ్చినవారిని, దివ్యాంగులను ఎస్పీ స్వయంగా కలసి వారి అర్జీలను స్వీకరించారు.సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, “ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదు, చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించాలి” అని ఆదేశించారు.