జహీరాబాద్: చిరాక్ పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద గోవా నుండి తరలిస్తున్న అక్రమ మద్యం పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చిరాకుపల్లి అంతర్ రాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద గోవా నుండి తరలిస్తున్న అక్రమ మద్యం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు గోవా నుండి హైదరాబాద్ వెళ్తున్న వివిధ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టి అక్రమంగా తీసుకెళ్తున్న నాలుగు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఎస్సై ఉమారాణి, సిబ్బంది మహేష్, ఉమాదేవి, శివ, కిషన్ ఉన్నారు.