ఒంగోలు అర్బన్: ఒంగోలులో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
Ongole Urban, Prakasam | Jun 26, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలంటూ అధికారులు ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి హాజరయ్యారు. కలెక్టర్ రాజాబాబు ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని బాగా చదువుకొని దేశ భవిష్యత్తును కాపాడాలని నేతలు పిలుపునిచ్చారు.