జహీరాబాద్: జహీరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల నిరసన
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులోని మహీంద్రా కర్మాగారం నుండి బీదర్ చెక్పోస్ట్ వరకు శనివారం సాయంత్రం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ పై కార్మిక సంఘాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ వ్యవస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని ఆరోపించారు. అనంతరం లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ కాపీని దగ్ధం చేశారు.