బేటీ బచావో–బేటీ పడావో పథకంపై గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణా కార్యక్రమం రాయచోటిలోని నారాయణ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్త్రీ–శిశు సంక్షేమ సాధికారిక అధికారి శ్రీమతి కె. హైమావతి అధ్యక్షత వహించారు.అవగాహన కార్యక్రమాలు ఏప్రిల్–మార్చి షెడ్యూల్ ప్రకారం అన్ని స్థాయిల్లో కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఆడపిల్ల పుట్టుక నుండి చదువు వరకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల ఆత్మరక్షణ, ఆత్మగౌరవం, సమానత్వం గురించి కార్యదర్శులకు సూచనలు ఇచ్చారు.