తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలంలో అన్నదాతలు వరి నాట్లకు సన్నద్ధమవుతున్నారు. దుక్కి దున్నకాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. అంతలోని రైతులు ఆదమరిచిన వేళ అదును చూసి మండలంలోని నెలబల్లి, భీమవరం గ్రామ పొలాల్లో దొంగలు పడ్డారు. ఆ రెండు గ్రామాలు 53 వ్యవసాయ మోటర్లు, స్టార్టర్లు, సర్వీస్ వైర్లను దోచుకు వెళ్లడంతో రైతులంతా లబోదెబోమంటున్నారు. దీంతో వారు మంగళవారంపోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. నేడో రేపో, వారి నాట్లు ప్రారంభించాల్సిన సమయంలో నీటి సరఫరా అందించే మోటర్లు దొంగలు పడి దొంగలించకపోవడంతో ఏమి చేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు. భారీ స్థాయిలో మోటర్లు దొంగతనానికి గురికావడం ఏమిటని చర్చించుకుంటు