నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలోని గొల్ల పేటలో నివాసముంటున్న రవి (29) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం రేపింది. పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని తల్లి మల్లీశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.