నారాయణపేట్: ఫోక్సో కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బి.భాస్కర్ నియామకం
నారాయణపేట జిల్లా ఫోక్సో ప్రత్యేక కోర్టుకు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బి.భాస్కర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మూడు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని ఎస్పి యోగేష్ గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఎస్పీ నూతన పిపి ని ఆహ్వానించి అభినందనలు తెలిపారు.