డిమాండ్ల పరిష్కారానికి ఆందోళన బాట పట్టిన విద్యుత్ ఉద్యోగులు.ఆత్మకూరు పట్టణంలో నిరసన తెలియజేసిన విద్యుత్ జేఏసీ నాయకులు
తమ డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డి ఏ బకాయిలను చెల్లించాలని, ఈపీఎఫ్ టు జిపిఎఫ్ వెంటనే చెల్లించాలని, విద్యుత్ ఉద్యోగస్తులకు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగస్తులు ఆందోళన బాట పట్టారు.