ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కేశవరాజు కుంటలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కేశవరాజు కుంటలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని పోలీసు క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు మరియు గంజాయికి దూరంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించినట్లు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. అలానే రోడ్డు ప్రమాదల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించినట్లు డి.ఎస్.పి చెప్పారు.