ఒంగోలు అర్బన్: జిల్లాలో జనగణనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 30, 2026
ఇంటింటి జనగణన నిర్వహణ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, అన్నీ జిల్లాల కలెక్టర్ల కు సూచించారు. మే నెలలో నిర్వహించవలసిన ఇంటింటి జనగణన కార్యక్రమం నిర్వహణపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె. నివాస్ తో కలిసి గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మే నెలలో చేపట్టే జన గణ మన గురించి వివరించారు