బనగానపల్లె: బ్రహ్మోత్సవాలకు కోవెలకుంట్ల శ్రీ పాండురంగ స్వామి దేవాలయం ముస్తాబు
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో వెలసిన పురాతన ప్రసిద్ధ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 26వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి, వైస్ ఛైర్మన్ నాగేంద్రబాబు గురువారం వెల్లడించారు. 26న కోట తిరునాళ్ల, 27న పేట తిరునాళ్ల, 28న కోనేటి తిరునాళ్ల, 29 రథోత్సవం, కళ్యాణం ఉంటాయని తెలిపారు