చిరుతపులి దాడిలో దూడ మృతి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని వడ్రంపల్లి గ్రామానికి చెందిన చిన్న అనే రైతు దూడ తన పొలం వద్ద ఉన్న దూడను బుధవారం రాత్రి చిరుత పులి దాడి చేసి మృతి చెందినట్లు రైతు తెలిపారు. గురువారం ఉదయం కోటం వెళ్లి చూడగా చిరుత పులి ఆనవాలు ఉన్నట్లు గుర్తించారు. ఇ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలాన్ని చేరుకుని పులి పంజా ను పరిశీలించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు కూడా ఒంటరిగా తిరగరాదని అవసరమైతే గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.