ఒంగోలు అర్బన్: జగనన్న హయంలో చేసింది చెప్పుకోలేక నష్టపోయాం: వైసిపి ప్రచార విభాగ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్
Ongole Urban, Prakasam | Apr 15, 2026
జగనన్న హయంలో ప్రజలకు చేసింది చెప్పుకోలేక తీవ్రంగా నష్టపోయామని వైసిపి రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. బుధవారం ఒంగోలు వైసిపి కార్యాలయంలో జరిగిన జోన్ 4 సమావేశంలో రాజశేఖర్ పాల్గొన్నారు. ఈనెల 20వ తేదీన వైసిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. దాని తర్వాత జరిగే ప్రాంతాల వివరాలు కూడా వెల్లడించారు. జగనన్న హయంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని అవి ఏవి చెప్పుకోలేకపోవడం వల్ల తాము ఓటమిపాలు చెందామని రాజశేఖర్ అన్నారు. ఇక మీదట సోషల్ మీడియా ప్రచార వింగ్ యాక్టివ్ గా పనిచేస్తుందన్నారు.